నిజామాబాద్ జిల్లాలో కానిస్టేబుల్ కొడుకు వీరంగం సృష్టించాడు. గొడవ సద్దుమనిపించేదుకు వెళ్లిన పోలీస్ అధికారులను పక్కకు నెట్టి కానిస్టేబుల్ కొడుకు న్యూసెన్స్ క్రియేట్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ లోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు ఓ వ్యక్తి. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో సదరు కానిస్టేబుల్ కు ఇతరులకు మద్య గొడవ జరిగింది.
పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ కొడుకు వచ్చి వీరంగం సృష్టించాడు. అడ్డు అదుపు లేకుండా వ్యవహరించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.