మణుగూరు, వెలుగు: గోదావరి నదిలో మునిగి పోతున్న ఓ యువకుడిని మణుగూరు పోలీస్కా నిస్టేబుళ్లు కాపాడారు. సోమవారం హోలీ సంద ర్భంగా మండల పరిధిలోని సుందరయ్య నగర్ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు కొండాయిగూడెం గోదా వరిలో ఈతకు వెళ్లారు.
అందులో తాటికొండ మహేశ్ అనే యువకుడు ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో మునిగిపో యాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేలు ళ్లు వినయ్. సనయ్ అతడిని చూశారు వెంటనే నదిలోకి దూకి కాపాడారు. కానిస్టేబుళ్లను మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ సతీశ్ కుమార్ అభినందించారు.