ఇసుక లారీ డ్రైవర్ ను పట్టుకుని నడిరోడ్డుపై బట్టలు విప్పి చితకబాదారు ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మాముళ్లు ఇవ్వాలంటూ లారీ డ్రైవర్ ను బెదిరించారు పోలీస్ కానిస్టేబుల్స్. ఆ సమయంలో లారీ డ్రైవర్ కి , కానిస్టేబుల్ కి మధ్య వాగ్వాదం జరిగింది.
అంతకుముందు లారీ ఆపకపోవడంతో డ్రైవర్ ను వెంబడించారు పోలీసులు. లారీ ఆగిన తర్వాత...డ్రైవర్ ని కిందకు దించి దాడి చేశారు కానిస్టేబుల్స్. ప్రతిరోజూ రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్టు పోలీస్ కానిస్టేబుల్స్ పై ఆరోపణలు ఉన్నాయి.
లోడుతో వచ్చిన లారీలను వదిలిపెట్టకుండా ఇద్దరు కానిస్టేబుల్ బెదిరింపులకు పాల్పడుతున్నారని డ్రైవర్లు ఆరోపిస్తు్న్నారు.