సమస్యాత్మాక ప్రాంతాల్లో .. సజావుగా ఎన్నికలు జరిగేలా చూడాలి : ప్రశాంత్ జీవన్ పాటిల్

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లాలోని సమస్యత్మాక  పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు మైక్రో అబ్జర్వర్లు కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. గురువారం కలెక్టర్ ఆఫీస్‌లో నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ లు జయ శ్రీ ఎస్. భోజ్, మన్మోహన్ ప్రసాద్, పోలీస్ అబ్జర్వర్ సోనం టెన్సింగ్ సమక్షంలో  మైక్రో అబ్జర్వర్ల కు రెండో విడత శిక్షణ తరగతులు నిర్వహించారు.  

 పోలింగ్ స్టేషన్‌లలో అన్ని సదుపాయాలు ఉండేలా మైక్రో అబ్జర్వర్‌‌లు చూడాలన్నారు.  సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్, మైక్రో అబ్జర్వర్ నోడల్ ఆఫీసర్ సత్యజిత్, ఎలక్షన్ సూపరింటెండెంట్ రామేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటి వద్ద ఓట్ల విషయంలో జాగ్రత్తలు పాటించాలి

మెదక్ టౌన్, వెలుగు:  మెదక్​ జిల్లా వ్యాప్తంగా 80 సంవత్సరాలు నిండి...  పోస్టల్​ బ్యాలెట్​కు ఇది వరకే దరఖాస్తు చేసుకొన్న వారు ఇంటి దగ్గర ఓటే వేసేలా చర్యలు తీసుకోవాలని  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​ రాజర్షి షా అన్నారు.  గురువారం మెదక్​ మండలంలోని మక్తభూపతిపూర్​లో ఓ ఇంటి వద్ద పోలింగ్ కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించారు.  ఈ సందర్భంగా ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి  అధికారులకు సూచనలు చేశారు.  

సంగారెడ్డి జిల్లాలో రూ. 4.82 కోట్లు సీజ్‌

సంగారెడ్డి టౌన్, వెలుగు: ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జిల్లాలో ఇప్పటివరకు 161 కేసుల్లో రూ.4,82,77,838  సీజ్ చేసినట్లు  జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శరత్  ఒక ప్రకటనలో తెలిపారు.  జిల్లాలో ఇప్పటివరకు రూ. 50 వేల రూపాయలు మించి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న 161 మంది నుంచి రూ.4,82,77,838 లు సీజ్ చేశామన్నారు.  సరైన ఆధారాలు సమర్పించిన 152 మందికి 3,34,81,738 రూపాయల నగదు విడుదల చేసినట్లు తెలిపారు.  

ALSO READ : ఒరేయ్ అది ఆడుకునే బండి కాదురా..ఎయిర్ పోర్ట్ బ్యాగేజ్ బెల్ట్పై రైడ్ చేసిన బాలుడు.. 

మిగిలిన 9  కేసులకు సంబంధించి రూ.1,47,96,100 లను సంబంధింతులు సరైన ఆధారాలను జిల్లా గ్రీవెన్స్ కమిటీలో సమర్పించి డబ్బును విడుదల చేసుకోవాలని కలెక్టర్  సూచించారు.  సందేహాల నివృత్తికి ప్రజలు జిల్లా గ్రీవెన్స్ కమిటీ సెల్ లో సంప్రదించవచ్చని సూచించారు.