కోల్‌బెల్ట్,వెలుగు : బీఆర్ఎస్ పాలనలో యువత జీవితాలు మారలేదని నియోజకవర్గ కాంగ్రెస్ లీడర్ డాక్టర్ రాజారమేశ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం క్యాతనపల్లి మున్సిపాలిటీ భీమాగార్డెన్స్ ఏరియాలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మందమర్రి, రామకృష్ణాపూర్‌కు చెందిన పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ వస్తే విద్యార్థులు, యువకుల జీవితాలు మారుతాయని అనుకున్న అందరికి కన్నీరే మిగిందన్నారు. యువత చైతన్యవంతులై ప్రజావ్యతిరేక బీఆర్ఎస్ పాలనపై ఉద్యమించాల్సిన తరుణం వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే అన్ని వర్గాల అభివృద్ది సాధ్యమవుతుందని చెప్పారు.