మోదీ సభకు తరలి వెళ్లిన బీజేపీ శ్రేణులు

వెలుగు నెట్​వర్క్: ​నిజామాబాద్​జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన ప్రధానమంత్రి మోదీ సభకు  ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డి, బోధన్,​ ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ, ఆర్మూర్, బాల్కొండ తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా బీజేపీ శ్రేణులు తరలివెళ్లారు. కామారెడ్డి నియోజకవర్గం నుంచి వెళ్లిన వెహికిల్స్​ను నియోజకవర్గ ఇన్​చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.