
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాచలంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభకు కేసీఆర్ రావొద్దంటూ పలువురు బీఆర్ఎస్ నేతలు మొక్కుకున్నారు. ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ గెలవడంతో కేసీఆర్ రానందువల్లే ఇది జరిగిందని నియోజకవర్గ నేతలు, ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాలకు గానూ భద్రాచలం తప్ప తొమ్మిది నియోజకవర్గాల్లో కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా పర్యటించారు. పినపాక నియోజకవర్గంలో పర్యటించే క్రమంలో భద్రాచలం కూడా కేసీఆర్ వస్తారని అంతా అనుకున్నారు. తీరా కేసీఆర్ భద్రాచలం తర్వాత అంటూ పినరపాక నుంచి వెళ్లిపోయారు. చివరికి భద్రాచలం బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్‌కు బదులు కేటీఆర్‌ను పిలిపించుకొని రోడ్ షో నిర్వహించేలా చేసుకున్నారు.