ఖమ్మం జిల్లాలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ సంబరాలు

  • 75 ఏండ్ల వేడుకల్లో పాల్గొన్న ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు,

వెలుగు, నెట్ వర్క్ : భారత రాజ్యాంగం అవతరించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టుల్లో రాజ్యాంగ దినోత్సవాలు నిర్వహించారు.  ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రాముఖ్యాన్ని తెలియజేశారు.  ప్రపంచంలోనే భారత రాజ్యాంగం చాలా గొప్పదని భద్రాద్రి కొత్త గూడెం కలెక్టర్ జితేష్​ వి.పాటిల్​ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన ప్రోగ్రాంలో అంబేద్కర్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామంటూ కలెక్టర్​తో పాటు పలు శాఖల ఆఫీసర్లు ప్రతిజ్ఞ చేశారు.

 రాజ్యాంగ స్ఫూర్తిని మనమంతా ముందుకు తీసుకెళ్లాలని భద్రాచలం ఫస్ట్​ క్లాస్​జ్యుడీషియల్​ జడ్జి వి.శివనాయక్​ పిలుపునిచ్చారు.  బార్​ అసోషియేషన్​ ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాసాచారి, ఉపాధ్యక్షురాలు ఎం.వి.రమ పాల్గొన్నారు.  రాజ్యాంగ స్ఫూర్తితో పోలీసులంతా సమాజాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఎస్పీ బి. రోహిత్​ రాజు పేర్కొన్నారు.  హేమచంద్రాపురంలోని పోలీస్​హెడ్​ క్వార్టర్‌‌లో మంగళవారం నిర్వహించిన రాజ్యాంగదినోత్సవం సందర్భంగా అంబేద్కర్​ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

 కొత్తగూడెంలోని జిల్లా కోర్టు ఆవరణలోని లైబ్రరీ మీటింగ్​హాల్లో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో జిల్లా జడ్జి పాటిల్​వసంత్, జిల్లా లీగల్​సెల్​అథారిటీ సెక్రెటరీ భానుమతి ​పాల్గొన్నారు.  దశాబ్దాల క్రితం రచించిన భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని కేటీపీఎస్ 5,6 ద శల చీఫ్ ఇంజనీర్ మేక ప్రభాకర్ రావు అన్నారు.  కర్మాగారం ఎస్ఈలు పి. వెంకటేశ్వర్లు, జీవీ ధర్మారావు, పి. కృష్ణ, బి. మోక్షవీర్ , డివైసీసీఏ పి. రామారావు, కిరణ్, ఫైర్ ఆఫీసర్ ఎడ్ల శ్రీనివాస్‌తో పాటు పలువురు ఇంజినీర్లు  కార్మికులు, ఆర్టిజన్లు పాల్గొన్నారు.

 ఖమ్మం జిల్లా మధిర కోర్టులో న్యాయవాదులు, కోర్టు సిబ్బందితో న్యాయమూర్తి  టి.కార్తీక్ రెడ్డి ప్రమాణం చేయించారు . న్యాయమూర్తి మాట్లాడుతూ..   ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో బార్​అసోసియేషన్​ అధ్యక్షులు  పుల్లారావు, నాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు .