ప్రతి ఒక్కరికి న్యాయం అందాలి : కె.యువరాజ్

ప్రతి ఒక్కరికి న్యాయం అందాలి : కె.యువరాజ్
  • సీనియర్ సివిల్ జడ్జి కె.యువరాజ్ 
  • ఘనంగా రాజ్యాంగ దినోత్సవం 

ఆసిఫాబాద్, వెలుగు : ప్రతి పేదవారికి రాజ్యాంగ పరమైన హక్కులతో పాటు న్యాయం అందాల్సిన అవసరం ఉందని సెక్రటరీ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, సీనియర్ సివిల్ జడ్జి కె.యువరాజ్ అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షా భూమి ప్రాంగణంలో ఆదివారం రాజ్యంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చీఫ్​గెస్ట్​గా సీనియర్ సివిల్ జడ్జి కె.యువరాజ్ హాజరైన సమతా భారత్ ఐక్య వేదిక పోస్టర్​ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం మహోన్నతమైనదన్నారు. 

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రాజ్యంగంలో సవరణలు జరుగుతాయి తప్ప రాజ్యాంగ ప్రియాంబుల్​ను ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని కోర్టులో జరిగే ప్రక్రియను కూడా లైవ్​లో తిలకించే అవకాశం వచ్చిందన్నారు. ఆసిఫాబాద్ ప్రాంతంలో గంజాయి, పోక్సో కేసులునమోదవుతున్నాయని.. యువత పెడదారి పట్టకుండా తల్లి దండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్ గోపీనాథ్, సీనీయర్ జర్నలిస్ట్ మసాదె లక్ష్మీనారాయణ, సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు దుర్గం హొక్టు, నిర్వాహకులు అన్నరావు జాడే, ఆనంద్ జాడే, డాక్టర్ టేమాజీ, ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ భుజంగరావు తదితరులు పాల్గొన్నారు.