ఏప్రిల్ 2 నుంచి రాజ్యాంగ రక్షణ యాత్ర

ఏప్రిల్ 2 నుంచి రాజ్యాంగ రక్షణ యాత్ర

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: జాతీయ మాలమహానాడు ఆధ్వర్యంలో ఉమ్మడి పది జిల్లాలను కలుపుతూ ఏప్రిల్  2 నుంచి 8 వరకు రాజ్యాంగ రక్షణ యాత్ర చేపడుతున్నట్లు తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కో-ఆర్డినేటర్  బ్యాగరి వెంకటస్వామి తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో యాత్ర కరపత్రాలను రిలీజ్​ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం, వాక్  స్వాతంత్రం కల్పిస్తూ రాజ్యాంగాన్ని రచించారన్నారు. 

ఢిల్లీలో మద్దతు ధర కోసం పోరాడుతున్న రైతులను కేంద్ర సర్కారు కాల్చి చంపుతోందని, మణిపూర్ లో మహిళలను వివస్త్రలను చేసి  హింసిస్తోందని ఆరోపించారు. ఇలాంటి దుర్మార్గపు పాలనను అంతమొందించాలనే సంకల్పంతో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ యాత్ర ప్రారంభిస్తున్నామని తెలిపారు. యాత్రకు అన్నివర్గాల ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు మద్దతు తెలపాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు- గండీటి చిన్న, ట్రెజరర్​ వాల్తాటి ఆంజనేయులు, అధికార ప్రతినిధి- గుడ్ల రవికుమార్, రాజు, కర్రె వెంకటేశ్  పాల్గొన్నారు.