
కరీంనగర్ రూరల్ /కరీంనగర్సిటీ, వెలుగు: పార్లమెంట్ లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానపరిచేలా మాట్లాడడం బాధాకరమని, అందుకే జై భీమ్ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో బుధవారం కరీంనగర్ కోతిరాంపూర్ లోని గాంధీ విగ్రహం నుంచి కమాన్ సెంటర్ వరకు, కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లిలో జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ పేరిట రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర నిర్వహించారు.
కార్యక్రమంలో కరీంనగర్ నియోజకవర్గ ఇన్ చార్జి పురుమల్ల శ్రీనివాస్, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి, రూరల్ మండల కోఆర్డినేటర్ అనిల్ , మండలాధ్యక్షుడు రాంరెడ్డి, యూత్ కాంగ్రెస్ లీడర్లు, మహిళా కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు.