హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా పీసీసీ ఇంటలెక్చువల్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గాంధీ భవన్ లో సెమినార్ జరగనుంది. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పాల్గొంటారని పార్టీ తెలిపింది.
ఎన్ఎస్ యూ ఆధ్వర్యంలో సంవిదాన్ దివస్ సభ జరగనుంది. దీనికి ఎన్ఎస్ యూఏ నేషనల్ ప్రెసిడెంట్ వరుణ్ చౌదరి అటెండ్ అవ్వనున్నారు.