
సంగారెడ్డి టౌన్, వెలుగు: దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండటం రాజ్యాంగం కల్పించిన హక్కని ప్రజాసంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ వీరయ్య అన్నారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బస్సు యాత్ర ఆదివారం సంగారెడ్డికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల ఇండ్ల స్థలాలపై ఈనెల 27 వరకల్లా ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని, లేకుండా ఉద్యమిస్తామని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలోని రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మందికి ఇంటి సౌకర్యం లేదని , డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసి పేదల సొంతింటి కల నెరవేరుస్తామని ఎన్నికల హామీని విస్మరించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల జీవోలను సవరించకుండా కాలయాపన చేసిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు, రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, నాయకులు వెంకట రాములు, సాగర్, స్కైలాబ్ బాబు సాయిలు మల్లేశం, అశోక్ ,మాణిక్యం ,నర్సింలు, రాజయ్య పాల్గొన్నారు.