న్యూఢిల్లీ: మనదేశంలోని 42 నగరాల్లో 5.08 లక్షల యూనిట్లతో కూడిన దాదాపు 2,000 హౌసింగ్ ప్రాజెక్టులు నిలిచిపోయాయి. డేటా అనలిటిక్ సంస్థ ప్రాప్ ఈక్విటీ రిపోర్టు ప్రకారం.. 1,981 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లు స్తంభించాయి. వీటిలో1,636 ప్రాజెక్టులు, 4,31,946 యూనిట్లు టైర్ 1 నగరాల్లో ఉండగా, 345 ప్రాజెక్టులు, మొత్తం 76,256 యూనిట్లు టైర్ 2 నగరాల్లో ఉన్నాయి.
2018 సంవత్సరంలో నిలిచిపోయిన యూనిట్లు 4,65,555 కాగా, ఈసారి వీటి సంఖ్య 5,08,202కి పెరిగింది. ప్రాప్‌ఈక్విటీ సీఈఓ సమీర్ మాట్లాడుతూ డెవలపర్ల అసమర్థత, డబ్బును వేరే అవసరాలకు వాడం, కొత్త భూములను కొనడం, నిధుల మళ్లింపు కారణంగా ఇలా జరుగుతోందని అన్నారు. ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేయడానికి డెవలపర్‌ల సామర్థ్యాల గురించి తెలియజేయడానికి స్వతంత్ర థర్డ్-పార్టీ ఆడిట్ సేవలను అందించాల్సిన అవసరం ఉందన్నారు.