సెంట్రలైజ్డ్​ కిచెన్​ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్​ ప్రతీక్ ​జైన్

సెంట్రలైజ్డ్​ కిచెన్​ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్​ ప్రతీక్ ​జైన్

కొడంగల్, వెలుగు: హరే కృష్ణ మూమెంట్ ద్వారా కొడంగల్ సెగ్మెంట్‎లోని అన్ని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వికారాబాద్ కలెక్టర్​ప్రతీక్​జైన్​తెలిపారు. కొడంగల్‎లో సెంట్రలైజ్డ్​కిచెన్​నిర్మాణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. నియోజకవర్గంలోని 312 ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 27 వేల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించడం జరుగుతుందన్నారు. 

కిచెన్​పనులు త్వరగా పూర్తి చేసి, పథకాన్ని వెంటనే ప్రారంభించాలని సంబంధిత అధికారులను అదేశించారు. అనంతరం ఎంపీపీ ఆఫీస్‎లో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీని కలెక్టర్​పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని సూచించారు. తహసీల్దార్​విజయ్​కుమార్, మున్సిపల్ కమిషనర్​బలరాం నాయక్​, ఎంపీడీఓ ఉషశ్రీ ఉన్నారు.