- మారుతున్న పాఠశాలల రూపురేఖలు
- యాదాద్రిలో 556 స్కూల్స్, రూ.24 కోట్లు
- సూర్యాపేటలో 508 స్కూల్స్, రూ.9.03 కోట్లు
- పనులు పూర్తి చేసేలా ప్రణాళిక
యాదాద్రి, సూర్యాపేట, వెలుగు : సర్కారుస్కూల్స్ఇక స్మార్ట్‌గా దర్శనవివ్వబోతున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్‌లో భాగంగా యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో 1,064 స్కూల్స్‌లో వసతుల కల్పన ప్రారంభమైంది. ఈ స్కూళ్లలో కరెంట్కనెక్షన్లు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, వాటర్ట్యాప్లు ఏర్పాటు చేయిస్తున్నారు. ప్రతి స్కూల్లో టాయిలెట్స్, మరుగుదొడ్లుఏర్పాటు చేయిస్తున్నారు. ప్రధానంగా బాలికల కోసం వసతుల కల్పనపై దృష్టి సారించారు. చివరగా అన్ని స్కూల్స్‌కు రంగులు వేసి అందంగా తీర్చిదిద్దుతున్నారు.
మధ్యలోనే మనఊరు– మనబడి..
గత ప్రభుత్వ హయాంలో మనఊరు– మనబడి పేరుతో పనులు ప్రారంభించారు. విద్యాకమిటీ ఆధ్వర్యంలో కొత్త తరగతి గదుల నిర్మాణం, తాగునీటి వసతి, కరెంట్, డైనింగ్ హాళ్ల పనులు చేపట్టగా, ఈజీఎస్ ద్వారా మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం నిర్వహణకు వంట గదులు, ప్రహరీ నిర్మాణం చేపట్టారు. ఎడ్యుకేషన్ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ తరగతి గదులు, ఫర్నిచర్, స్కూల్స్ పేయింటింగ్, కలర్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఆయా శాఖల మధ్య సమన్వయ లోపంతో పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం ఏర్పడింది. దీనితో మధ్యలోనే పనులను నిలిపివేశారు.
యాదాద్రిలో 556 స్కూల్స్..
కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సర్కారు బడులపై దృష్టి సారించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అమ్మ ఆదర్శ స్కూల్స్ స్కీమ్ ను ప్రవేశపెట్టారు. 'మనఊరు–-మనబడి' కార్యక్రమంలో భాగంగా పనులు చేపట్టిన స్కూల్స్కాకుండా ఇతర స్కూల్స్‌లో మరమ్మతులు, కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్కూళ్లలో కనీస వసతులైన టాయిలెట్ల నిర్మాణం, డ్రింకింగ్ వాటర్, కరెంట్ కనెక్షన్ ఇవ్వడంతోపాటు ప్రతి తరగతి గదిలో ఫ్యాన్లను ఏర్పాటు చేయనున్నారు.
ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాలో 556 స్కూల్స్‌ను ఎంపిక చేశారు. ఈ స్కూల్స్ లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వంరూ.24 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటివరకు 207 స్కూల్స్‌లో పనులు పూర్తి దశకు చేరుకున్నాయి. మరికొన్ని స్కూల్స్‌లో పనులు స్పీడ్‌గా కొనసాగుతున్నాయి.
సూర్యాపేటలో 508 స్కూల్స్..
అమ్మ ఆదర్శ స్కూల్స్స్కీమ్లో సూర్యాపేట జిల్లాలో 508 స్కూల్స్‌ను ఎంపిక చేశారు. ఈ స్కూల్స్‌లో మౌలిక వసతుల కల్పిన కోసం రూ.9.3 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు వంద స్కూల్స్‌లో పనులు 90 శాతం పూర్తయ్యాయని ఆఫీసర్లు చెబుతున్నారు. మరికొన్నింటిలో దాదాపు 50 శాతం పనులు కంప్లీట్ అయ్యాయని చెబుతున్నారు.
2024–-25 విద్యాసంవత్సరం ప్రారంభంకావడానికి ముందే అన్ని స్కూల్స్‌లో పనులు పూర్తి చేయాలని ఆఫీసర్లు నిర్ణయించుకున్నారు. స్కూల్స్ ప్రారంభమైతే.. పనులు వేగం పుంజుకోవని భావిస్తున్నారు. సాధ్యమైనంత స్పీడ్‌గా పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో అధికారులు ముందుకు సాగుతున్నారు.