- ఔటర్‌రింగ్ రోడ్డు పనులపై మాస్టర్ ప్లాన్
- ఆర్అండ్‌బీ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి రివ్యూ
నల్గొండ, వెలుగు : నల్గొండలో కొత్త కలెక్టరేట్ భవన నిర్మాణం కోసం త్వరలో చర్యలు చేపడతామని ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో ఆ శాఖ ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి హయాంలో నిర్మించిన నల్గొండ కలెక్టరేట్భవనంపాతబడిపోవడంతో కొత్త భవనం నిర్మాణం కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ సమస్య తీర్చేందుకు ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మించాలని
ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులకు సూచించారు. భూనిర్వాసితులకు వెంటవెంటనే నష్టపరిహారం అందించేలా ప్యాకేజీ రూపొందించాలని చెప్పారు. పట్టణానికి దూరంగా రింగ్ రోడ్డు నిర్మిస్తే ప్రయోజనం ఉండదని, అలా కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా రింగురోడ్డు మాస్టర్ ప్లాన్ ఉండాలని ఆదేశించారు.