![ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు పనులు మంత్రి పరీశీలన](https://static.v6velugu.com/uploads/2023/02/BRS-party-central_byrTPRax3s.jpg)
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ పనులను పరిశీలించేందుకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. పనుల పురోగతిపై ఆర్కిటెక్ట్, వర్క్ ఏజెన్సీతో సమీక్ష నిర్వహించారు. అధినేత కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.