పూసాల రోడ్డు పనులు ఆపాలని ఆందోళన

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్​ పట్టణంలోని పూసాల రోడ్డు నిర్మాణ పనులు వివాదాస్పదంగా మారుతున్నాయి. అవసరానికి మించి ఎత్తుగా కడుతున్నారని గురువారం స్థానికులు ఆందోళన చేశారు. పనులను అడ్డుకున్నారు. రోడ్డు ఎత్తును పెంచడం వల్ల తమ నివాసాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కాంట్రాక్టర్ కు సంబంధించిన వ్యక్తులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అనంతరం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ను కలిసి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. రోడ్డు నిర్మాణం పేరుతో నల్లా కనెక్షన్లు తొలగించి మళ్లీ బిగించడం లేదని  ఫిర్యాదు చేశారు.