నార్కట్పల్లి, వెలుగు : మాజీ ఎంపీటీసీ సైదులు ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ లో రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని భవన నిర్మాణ కార్మికులు కలిసి వినతిపత్రం అందజేశారు. మండలంలోని అమ్మనబోలు గ్రామంలో భవన నిర్మాణ సంఘం
తాపీ మేస్త్రి సంఘం భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసినవారిలో మాజీ ఎంపీటీసీ సైదులు, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు.