ఎన్నికల్లో పెరిగిన కన్సల్టెన్సీల ప్రభావం

ఎన్నికల్లో పెరిగిన కన్సల్టెన్సీల ప్రభావం
  • హెచ్​సీయూ పొలిటికల్​ సైన్స్​ హెడ్​ కైలాశ్​​ కున్హి

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: దేశంలో జరుగుతున్న ప్రతీ ఎలక్షన్లలో రాజకీయ కన్సల్టెన్సీల ప్రభావం పెరిగిపోతుందని హెచ్​సీయూ పొలిటికల్​ సైన్స్​ హెడ్ ప్రొఫెసర్ కైలాశ్​ కున్హి కృష్ణన్ అన్నారు. పటాన్​చెరు పరిధిలోని గీతం డీమ్డ్​ యూనివర్సిటీ స్కూల్​ఆఫ్ హ్యుమానిటీస్​అండ్ సోషల్ సైన్సెస్​ఆధర్వర్యంలో శుక్రవారం 'ఎన్నికల ప్రచారం,-పెరుగుతున్న రాజకీయ సలహాదారుల పాత్ర' అంశంపై వర్క్​షాప్ నిర్వహించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పెరిగిన జనాభాకు అనుగుణంగా లోతైన ప్రజాస్వామ్యీకరణ కోసం టెక్నాలజీ ఉపయోగం తప్పడం లేదన్నారు. మన దేశంలో ఎన్నికల ఖర్చు మిగతా దేశాల కంటే మించి పోయాయని, వాటితో పాటు రాజకీయ నిర్మాణాలు, సిద్ధాంతాల ప్రక్రియలో కన్సల్టెన్సీల పాత్ర విపరీతంగా పెరిగిందన్నారు. రాజకీయ పార్టీల జవాబుదారీతనంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డాక్టర్​ విఘ్నేశ్​ కార్తీక్​, మయాంక్​ మిశ్రా, సురేశ్ కుమార్​ పాల్గొన్నారు.