
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్(ఎస్ వీఎన్ఐఆర్ టీఏఆర్) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టులు 12 : డెమాన్ స్ట్రేటర్ 01, ఫిజియోథెరపిస్ట్01, ఆక్యుపేషనల్ థెరపిస్ట్01, స్టాఫ్ నర్స్08, స్టెరిలైజేషన్ టెక్నీషియన్ 01.
ఎలిజిబిలిటీ : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ(నర్సింగ్), డిగ్రీ(ఆక్యుపేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ, ప్రోస్తేటిక్స్, ఆర్థోటిక్స్), పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి
అప్లికేషన్ : ఆఫ్లైన్ ద్వారా. ది డైరెక్టర్ స్వామి వివేకానంద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలేషన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, ఓలత్పూర్, బైరోయ్, కటక్, ఒడిశా చిరునామాకు పంపించాలి.
సెలెక్షన్ ప్రాసెస్ : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.