అంబానీ కంపెనీ ఆఫర్: మా షాపుల్లో అప్పులిస్తాం.. వస్తువులు కొనుక్కోండి

అంబానీ కంపెనీ ఆఫర్: మా షాపుల్లో అప్పులిస్తాం.. వస్తువులు కొనుక్కోండి

పండక్కి మీ దగ్గర డబ్బులు లేవా..  డోంట్ వర్రీ.. పండగ పూట కొత్త వస్తువులు కొనాలని ప్లాన్ చేసుకున్నారా.. అందుకు తగినంత డబ్బు లేదని వర్రీ అవుతున్నారా.. అస్సలు ఫీలవ్వద్దు.. మీరు హ్యాపీ రిలయన్స్ డిజిటల్ స్టోర్ కు వెళ్లండి.. మీకు నచ్చిన వస్తువులు తీసుకోండి.. ఇంటికి తెచ్చుకోండి.. ఏంటీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదా.. ఫ్రీనా అని అనుకుంటున్నారా.. అదేమీ లేదంట.. అప్పులు ఇస్తున్నారు జియో, రిలయన్స్ డిజిటల్ స్టోర్స్. దసరా పండుగ సందర్భంగా.. హోం అప్లయినెన్స్ పై అప్పులు ఇస్తూ.. వాయిదాల్లో చెల్లించాలనే ఆఫర్ ఇస్తున్నారు. దేశ వ్యాప్తంగా 300 స్టోర్స్ లో ఈ విధాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.. 

జియో ఫైన్సాన్స్ కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్

మీరు కోరుకున్న ఫర్నీచర్ నుంచి ఫ్యాన్సీ ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు వినియోగదారులు జియో ఫైనాన్స్  డ్యూరబుల్ లోన్ తో కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాదు మీరు జీరో డౌన్ పేమెంట్, ఫోర్ క్లోజర్ ఛార్జీలు లేకుండా రుణం పొందొచ్చు. 

Also Read :- భారీగా పెరిగిన బంగారం ధర

పర్సనల్ లోన్స్ పొందడం ఎలా..

మీరు చిన్న ఉద్యోగులా.. ప్రైవేట్ సంస్థలలో పనిచేస్తున్నారా.. లేక మీరు స్వయం ఉపాధికోసం చిన్న వ్యాపారాలను నడుపుతున్నారా.. అయితే మీ కలలను సాకారం చేసుకునేందుకు జియో ఫైనాన్స్ ద్వారా రుణాలు పొందొచ్చు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా, బ్యాంకుతో సంబంధం లేకుండా  రూ. 30 వేల రుణం పొందొచ్చు. మీ ఆధార్ కార్డు, మొబైల్, పాన్ వివరాలు సమర్పించడం ద్వారా లోన్ పొందొచ్చు..