ఆస్పత్రి బిల్లుకు ఎందుకు క్లెయిమ్ చేయలే..రూ.8లక్షలు చెల్లించాల్సిందే..కన్య్సూమర్​ ఫోరం

ఆస్పత్రి బిల్లుకు ఎందుకు క్లెయిమ్ చేయలే..రూ.8లక్షలు  చెల్లించాల్సిందే..కన్య్సూమర్​ ఫోరం
  • బాధితునికి రూ. 8లక్షలు వడ్డీతో సహా చెల్లించండి
  • మానసికంగా వేధించినందుకు మరో రూ.50వేలు కూడా
  • స్టార్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ కంపెనీకి కన్స్యూమర్​ ఫోరమ్ ​ ఆర్డర్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: హెల్త్​ పాలసీ ప్రీమియం  రెగ్యులర్​గా చెల్లించినా.. ఆస్పత్రి   ​బిల్లుకు క్లైమ్​ ఇవ్వని స్టార్​ హెల్త్​ ఇన్సూరెన్స్​ కంపెనీ మూల్యం చెల్లించా లని కన్య్సూమర్​ ఫోరం  తీర్పు ఇచ్చింది. బాధితునికి మానసిక వేదన కలిగించినందుకు  మరో రూ. 50వేలు, కమిషన్​ టైం వేస్ట్​ చేసిందుకు రూ.10 వేలు జరిమాన చెల్లించాలని ఆర్డర్స్​ ఇచ్చింది.  

హైదరాబాద్​కు చెందిన బాధితుడు  మహమ్మద్​ హబీమ్​ వివరాల ప్రకారం.. అతను 2016 లో రూ. 10లక్షల ఆరోగ్య బీమా పాలసీలో చేరాడు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా పాలసీ కడుతున్నాడు. ఈ క్రమంలో 2021లో ఓ ఆస్పత్రిలో బైపాస్​ సర్జరీ చేయించుకున్నాడు. దానికి రూ. 8.24 లక్షల బిల్లు అయింది. క్లైమ్​ కోసం ఇన్సూరెన్స్​ కంపెనీని సంప్రదించగా.. వారు అప్లికేషన్​ను రిజక్ట్​ చేశారు. 

ఇన్సూరెన్స్​ రాదంటూ వెనక్కి పంపారు. దీంతో చేసేదేమీ లేక బాధితులు ఆస్పత్రి బిల్లు చెల్లించి, జిల్లా కన్స్యూమర్​ ఫోరమ్ ను సంప్రదించి అక్కడి నుంచి స్టేట్​ ఫోరమ్ ను ​ ఆశ్రయించాడు. 

కేసును విచారించిన కోర్టు  పాలసీ ఆగకుండా ప్రీమియం చల్లించినప్పటికీ...కేవలం డబ్బు చెల్లించాల్సి వస్తుందనే నెపంతోనే పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ను పక్కన పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్సురెన్స్ కంపెనీకి, నియోగదారుడు డిశ్చార్జి అయిన  నుంచి 2024 అక్టోబర్ 15  వరకు రూ.8,24,731 బిల్లు మెత్తానికి 9% వడ్డీతో కలిపి చెల్లించాలని  తీర్పు నిచ్చింది. 

మానసిక వేదనకు గురి చేసినందుకుగాను రూ. 50వేలు, కమిషన్ సమయం వృథా చేసినందుకు రూ. 10వేలు జరిమానా విధిస్తూ కమిషన్ తీర్పునిచ్చింది.