ఎండలకు మొఖం మాడిపోయిందా..? ఈ ఏడు పండ్లు తింటే దగదగా మెరిసిపోవాల్సిందే..!

ఎండలకు మొఖం మాడిపోయిందా..? ఈ ఏడు పండ్లు తింటే దగదగా మెరిసిపోవాల్సిందే..!

సమ్మర్ సీజన్ పీక్ స్టేజ్‎కు చేరుకుంది. ఎండలు మండిపోతున్నాయి. రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో జనం బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఇక ఎమర్జెన్సీ వర్క్ ఉంటే బయటకు వెళ్లక తప్పని పరిస్థితి. ఇలా బయటకు వెళ్తే.. ఎండలకు బాడీ డీహైడ్రేట్ కావడం తద్వారా ఫేస్‎లో కాంతి తగ్గి డల్ అయిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ఎండకాలంలో బాడీ డీహైడ్రేట్ కాకుండా మొఖం వాడిపోకుండా తాజాగా నిగనిగలాడడానికి హెల్త్ ఎక్స్‎పర్ట్స్ కొన్ని సూచనలు చేస్తున్నారు. 

ఎక్కువగా వాటర్ తాగడం, మజ్జిగ పండ్ల రసాలు వంటి ద్రవ పదార్థలు తీసుకోవాలని చెబుతున్నారు. వీటితో పాటు సమ్మర్‏లో ఫేస్ తాజాగా ఉండాలంటే.. పోషకాలతో నిండిన కొన్ని ఆరోగ్యకరమైన పండ్లను క్రమం తప్పకుండా తినాలంటున్నారు. ముఖ్యంగా ఎండకాలంలో ఏడు రకాలు పండ్లు తినడం ద్వారా శర్మ సమస్యలు దరి చేరకుండా చూసుకోవచ్చట. ఈ పండ్లు తింటే.. ముఖంలో  వృద్ధాప్య లక్షణాలు కనబడకుండా ఫేస్ ఎల్లప్పుడు యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చట. 

ఆ ఏడు పండ్లు ఏంటంటే..?

బొప్పాయి: బొప్పాయి అనేక ప్రయోజనాలతో నిండిన ఆరోగ్యకరమైన పండు. ఇందులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ముఖంపై మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది, స్కిన్ ఫ్రెష్ గా ఉండేలా ప్రోత్సహిస్తోంది.

పుచ్చకాయ: వేసవిలో బెస్ట్ ఫ్రూట్ వాటర్‎మిలన్. పుచ్చకాయలో పుష్కలంగా ఉండే విటమిన్ సీ, లైకోపీన్ చర్మాన్ని ఎండ దెబ్బతినకుండా కాపాడతాయి. బాడీ డీహైడ్రేట్ కాకుండా కాపాడుతోంది. పుచ్చకాయ కొల్లాజెన్‎ను కూడా ఉత్పత్తి చేస్తోంది.

మామిడి పండ్లు: పండ్లలో రాజుగా మామిడి. ఇందులో విటమిన్ ఎ, సీ ల పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీని హైడ్రేట్ చేయడానికి సహాయపడతాయి. ముఖంపై ఉన్న గీతలు, ముడతలను తగ్గిస్తాయి. అయితే, మామిడి పండ్లను లిమిటెడ్‎గా తీసుకోవడం ముఖ్యం. ఎందుకంటే మ్యాంగోస్ ఎక్కువగా తింటే వేడి అవుతోంది. 

పైనాపిల్: విటమిన్ సీ, మాంగనీస్ పుష్కలంగా ఉండే పైనాపిల్‌ కూడా చర్మానికి ఎంతో ఉపయోగం. ఈ పండులో దొరికే విటమిన్లు చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడానికి సహాయపడతాయి. వేసవి కాలంలో నల్ల మచ్చలు, హైపర్‌పిగ్మెంటేషన్ రూపాన్ని తగ్గిస్తాయి.

కివి: ఈ పండులో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పర్యావరణ ఒత్తిళ్ల నుండి చర్మాన్ని రక్షించడంలో కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో కివి సహాయపడుతుంది.

స్ట్రాబెర్రీలు: రుచికి రుచి, పోషకాలకు పోషకాలు ఉండే స్ట్రాబెర్రీ కూడా చర్మానికి ఎంతో ఉపయోగం. వీటిలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఎండ దెబ్బతినకుండా కాపాడుతుంది ముఖంపై గీతలు, అకాల ముడతలను తగ్గిస్తుంది.

నారింజ: విటమిన్ సీ, ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉండే నారింజలు చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి, స్కి్న్ టోన్‌ను సమం చేయడానికి సహాయపడతాయి. నల్ల మచ్చలు, హైపర్‌పిగ్మెంటేషన్ రూపాన్ని తగ్గిస్తాయి.

►ALSO READ | క్యాడ్బెరీ జెమ్స్ తిన్నంత ఈజీగా డోలో 650 వాడుతున్నారు: డాక్టర్ కామెంట్స్ వైరల్