డాక్టర్ లేకున్నాపేషెంట్‌‌ ను చూసుకునే డివైజ్

డాక్టర్ లేకున్నాపేషెంట్‌‌ ను చూసుకునే డివైజ్

కరోనా నుంచి తమను తాము కాపాడుకోడానికి హెల్త్ వర్కర్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వైరస్ ప్ర‌‌‌‌భావం పేషెంట్  మీద ఎంత వరకు ఉందని తెలుసుకునేందుకు పేషెంట్ దగ్గరకు త‌‌‌‌ర‌‌‌‌చూ వెళ్తుంటారు. వెళ్ళిన ప్రతిసారీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే వాళ్ళ పనిని ఇంకాస్త సులభం చేసేందుకు ముగ్గురు మహిళా ఇంజినీర్లు కలిసి ఒక డివైజ్ తయారు చేశారు. దానితో.. డాక్టర్లు తమ క్యాబిన్లలో కూర్చుని పేషెంట్ల పరిస్థితి తెలుసుకోవచ్చు. డాక్టర్ లేక‌‌‌‌పోయినా ఈ డివైజ్ పేషెంట్‌‌‌‌పై ఓ క‌‌‌‌న్నేసి ఉంచుతుంది.

డాక్టర్లకు, నర్సులకు కరోనా సోకకుండా ఉండాలంటే.. ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఒకటి ‘నాన్- కాంటాక్ట్ స్క్రీనింగ్’. కానీ అది అంత సులువైన పని కాదు.   అందుకే హెల్త్ వర్కర్లకు కరోనా సోకే ముప్పు ఎక్కువగా ఉంది. ఆ ముప్పును తగ్గించడానికే రంజనా నాయర్, ఆర్ద్రాకన్నన్ అంబిలి, సాంచి పూవయ అనే ముగ్గురు మహిళా ఇంజినీర్లు కలిసి ఒక డివైజ్ తయారుచేశారు. వీళ్లకు టెక్నాల‌‌‌‌జికల్ రీసెర్చ్‌‌‌‌​లో చాలా అనుభవం ఉంది. ప్రస్తుతం ఆర్ఐవోటీ(RIOT)సొల్యూషన్స్ అనే స్టార్టప్‌‌‌‌ నడుపుతున్నారు. వాళ్లు కాంటాక్ట్‌‌‌‌లెస్, వై-ఫై ఎనేబుల్డ్, ఏఐతో పనిచేసే రే ఐవోటీ (rey IoT) డివైజ్‌‌‌‌ తయారు చేశారు. ఇది శ్వాసక్రియను పూర్తిగా మానిట‌‌‌‌ర్ చేస్తుంది. పేషెంట్ల దగ్గర పెట్టిన ఈ డివైజ్‌‌‌‌లు అన్నింటినీ ఒక సెంట్రల్ డేటాబేస్‌‌‌‌కు కనెక్ట్ చేస్తారు. అది ఒకేసారి లక్ష మంది పేషేంట్లను మానిట‌‌‌‌ర్ చేస్తుంది. క్వారంటైన్ చేసిన పేషెంట్లలో వాళ్ళ ఆరోగ్య స్థితిని బట్టి, పెద్దగా ప్రమాదం లేని, ప్రమాదం ఉన్న,  ఎక్కువ ప్రమాదం ఉన్న వాళ్లుగా డివైడ్ చేస్తుంది.

ఫ్లూ నుంచి కరోనా వరకు

వైరస్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఒక సాధారణ లక్షణం ఉంటుంది. అదే బ్రీతింగ్ ప్రాబ్లం. వైరస్ తీవ్రత తక్కువగా ఉంటే బ్రీతింగ్‌‌‌‌లో కాస్త సమస్య ఉంటుంది. ఇన్ఫెక్షన్ పెరిగితే బ్రీతింగ్ చాలా క‌‌‌‌ష్టం అవుతుంది. దీన్ని బేస్ చేసుకునే ఈ డివైజ్ తయారుచేశారు. ఇది  మినీ- ఐసియు మానిటరింగ్ యూనిట్‌‌‌‌గా పని చేస్తోంది. డాక్టర్లు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా యాప్ ద్వారా దీన్ని ఆపరేట్ చెయ్యొచ్చు. ఈ డివైజ్‌‌‌‌ను పేషెంట్లకు  మూడు అడుగుల దూరంలో పెడతారు. బ్రీతింగ్‌‌‌‌లో మార్పులు వస్తే అది వెంటనే డాక్టర్‌‌‌‌ ఫోన్‌‌‌‌లోని యాప్‌‌‌‌కి నోటిఫికేషన్లు పంపుతుంది. బ్రీత్ సెన్సింగ్ మాడ్యూల్‌‌‌‌తో పాటు, ఇందులో ఆడియో, వీడియో స్ట్రీమింగ్ చేసే సౌకర్యం కూడా ఉంది. దీని ద్వారా పేషెంట్లతో డాక్టర్లు మాట్లాడొచ్చు. క్రిటికల్ కండిషన్‌‌‌‌లో ఉన్న పేషెంట్లకు ఇది బాగా ఉపయోగడుతుంది.

హోం క్వారంటైన్‌‌‌‌లో ఉన్నవాళ్లకు..

క‌‌‌‌రోనా ఉందేమోన‌‌‌‌నే అనుమానం ఉన్నవాళ్లను సాధార‌‌‌‌ణంగా ఇంట్లోనే క్వారంటైన్ చేస్తారు. అలాంటి వాళ్లను ఎప్పటిక‌‌‌‌ప్పుడు అబ్జర్వ్‌‌‌‌ చేయడం కష్టం. అలాంటప్పుడు ఈ డివైజ్‌‌‌‌ను వాళ్ల దగ్గర ఉంచితే చాలు. పేషెంట్ పరిస్థితిని ఎప్పటిక‌‌‌‌ప్పుడు డాక్టర్‌‌‌‌‌‌‌‌కు చేర‌‌‌‌వేస్తుంది.

అద్దెకు..

ఈ డివైజ్‌‌‌‌ ఒక యూనిట్ ధ‌‌‌‌ర  19,999 రూపాయ‌‌‌‌లు ఉంది. దీన్ని కిరాయికి ఇవ్వడానికి కూడా కంపెనీ సిద్ధంగా ఉంది. రోజుకు ఒక యూనిట్‌‌‌‌కు 300 చొప్పున కిరాయి తీసుకుంటారు. దీన్ని ఆపరేట్‌‌‌‌ చేసేందుకు హెల్త్‌‌‌‌వ‌‌‌‌ర్కర్లకు ట్రైనింగ్‌‌‌‌ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈజీగా యూజ్ చెయ్యెచ్చు.