స్కూటీని ఢీకొట్టిన కంటెయినర్‌‌‌, ఇద్దరు మృతి.. సంగారెడ్డి జిల్లా ముత్తంగి వద్ద ప్రమాదం

స్కూటీని ఢీకొట్టిన కంటెయినర్‌‌‌, ఇద్దరు మృతి.. సంగారెడ్డి జిల్లా ముత్తంగి వద్ద ప్రమాదం

పటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెరు, వెలుగు: ముందు వెళ్తున్న స్కూటీని కంటెయినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లారీ ఢీకొట్టడంతో ఓ మహిళ, మరో యువకుడు చనిపోయారు. ఈ ప్రమాదం సంగారెడ్డి జిల్లా ముత్తంగి వద్ద ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... అమీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం కిష్టారెడ్డిపేటకు చెందిన నాగశ్యామల (26), తన బంధువు గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (17)తో కలిసి ఆదివారం స్కూటీపై సంగారెడ్డికి వెళ్తోంది. ముత్తంగి వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన కంటెయినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లారీ ఢీకొట్టింది. దీంతో స్కూటీ అదుపుతప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. వారిపై నుంచి లారీ వెళ్లడంతో నాగశ్యామల, గణేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అక్కడికక్కడే చనిపోయారు.