అలంపూర్, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తా ఫ్లైఓవర్ వద్ద 44 నంబర్ హైవేపై హైదరాబాద్ వైపు నుంచి కర్నూల్ వైపు వెళ్తున్న కంటైనర్ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ రాం బహదూర్, క్లీనర్ మాన్ వేందర్ కు స్వల్ప గాయాలయ్యాయి. హర్యానా రాష్ట్రం గురుగావ్ నుంచి కర్నాటక రాష్ట్రం కోచ్ కోడ్ కు కొరియర్లో డ్తో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
గాయపడిన వారిని హైవే అంబులెన్స్ లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కంటైనర్ రోడ్డుకు అడ్డంగా బోల్తా పడడంతో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు చర్యలు చేపట్టారు.