ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన తమన్నా లవర్ విజయ్ వర్మ కొత్త వెబ్ సిరీస్ ఐసీ 814 ది కాందాహార్ హైజాక్ (IC 814 Kandahar Hijack). ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ చిక్కుల్లో పడింది. కావాలనే నెట్‌ఫ్లిక్స్ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తోందని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోశారు.మరోవైపు, ఈ సిరీస్ బ్యాన్ చేయాలని ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది.
అయితే ఈ వెబ్ సిరీస్‌లో ఉగ్రవాదులకు 'శంకర్', 'భోలా' వంటి హిందూ పేర్లను ఉపయోగించిన తీరుకు నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్‌కు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది.ఈ వివాదానికి దారితీసిన అంశాలపై తక్షణమే వివరణ నెట్‌ఫ్లిక్స్ ను ఆదేశించింది. తాజాగా మంగళవారం (సెప్టెంబర్ 3న) సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో.."భవిష్యత్తులో కంటెంట్ దేశ ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఉంటుందని కేంద్రానికి నెట్‌ఫ్లిక్స్ హామీ ఇచ్చింది".
Also Read:-కంటెస్టెంట్ల మధ్య కొట్లాట
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ.."నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని నెట్‌ఫ్లిక్స్ హామీ ఇచ్చింది. అలాగే భవిష్యత్తులో నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారమ్‌లోని కంటెంట్ దృష్ట్యా..దేశం యొక్క మనోభావాలను గౌరవిస్తూ..మరియు దానికి అనుగుణంగా సున్నితంగా కంటెంట్ ఉంటుందని హామీ ఇచ్చింది" అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Netflix India content head meets I&B ministry after contentions raised on series based on IC-814 hijack
— ANI Digital (@ani_digital) September 3, 2024
Read @ANI Story | https://t.co/7leGu9ojgC#Netflix #IC814 #Kandaharhijacking #entertainment pic.twitter.com/Pv5uxIjpmR
విమానాన్ని హైజాక్ చేసిన ఐదుగురు ఉగ్రవాదుల పేర్లు ఇబ్రహీం అథర్, షాహిద్ అక్తర్ సయ్యద్, సన్నీ అహ్మద్ ఖాజీ, మిస్త్రీ జహూర్ ఇబ్రహీం, షకీర్. కానీ, ఈ వెబ్ సిరీస్‌లో ఉగ్రవాదులకు 'శంకర్', 'భోలా' వంటి హిందూ పేర్లను, 'చీఫ్', 'డాక్టర్', 'బర్గర్' వంటి పేర్లను ఉపయోగించారు. దీంతో ఈ వివాదం అగ్గి రాజుకుంది.
ఢిల్లీ హైకోర్టులో పిల్
తాజాగా ఢిల్లీ హైకోర్టులోనూ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (పిల్) దాఖలైంది. హిందూ సేన అధ్యక్షుడు, రైతు అయిన సూర్జిత్ సింగ్ యాదవ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సిరీస్ కు సీబీఎఫ్‌సీ ఇచ్చిన సర్టిఫికెట్ రద్దు చేసి, వెంటనే సిరీస్ ను నిషేధించాలని కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని..అలాగే భవిష్యత్తులో ఇదొక తప్పుడు సాంప్రదాయానికి తెరతీస్తుంది. ఇది ప్రజల్లో మరింత తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేయకుండా వెంటనే కోర్టు జోక్యం చేసుకోవాలి" అని పిటిషన్ లో సూర్జిత్ సింగ్ కోరారు.
Also Read:-నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కు కేంద్రం సమన్లు
ఈ సీరీస్లో ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ ఐసీ 814 విమానం కెప్టెన్ శరణ్ దేవ్ గా నటించాడు. స్టార్ హీరో అరవింద్ స్వామి.. విదేశాంగ శాఖ సెక్రటరీ శివరామకృష్ణన్ పాత్రలో నటించగా..రా జాయింట్ సెక్రటరీ రంజన్ మిశ్రాగా నటుడు కుముద్ మిశ్రా కనిపించారు.