ప్రకాశం జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పోలింగ్ జరుగుతున్న దర్శి మండలంలో టీడీపీ .. వైసీపీ కార్యకర్తలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. బొట్లపాలెం గ్రామంలోని 155 వ పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఉండగానే టీడీపీ కార్యకర్తలపై .... వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ టీడీపీ కార్యకర్త గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.