ఖమ్మం జిల్లా వార్తలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వచ్చే ఎన్నికల్లోనూ కొత్తగూడెం నుంచి పోటీ చేస్తానని  స్పష్టం చేశారు. ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో శనివారం మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ ఆశీస్సులు తనకు ఉన్నాయని చెప్పారు. కొంత మంది తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తాను ప్రజల మనిషిని అని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే తనపై కావాలనే రాజీనామా అంటూ ప్రచారం చేయడం విచారకరమని అన్నారు.

డీడీ హామీతో సమ్మె విరమణ
భద్రాచలం, వెలుగు: సమస్యలు పరిష్కరించేందుకు ఐటీడీఏ డీడీ రమాదేవి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఐటీడీఏ హాస్టల్​ డైలీ వేజ్, ఔట్​సోర్సింగ్ వర్కర్లు శనివారం సమ్మెను విరమించారు. రెండు నెలల వేతనాలు వెంటనే చెల్లించి మిగిలిన జీతం సెప్టెంబర్​లో ఇస్తామని చెప్పారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఐటీడీఏ వద్ద డీడీతో వర్కర్లు చర్చలు జరిపారు. రెండు నెలల వేతనాలకు రూ.2.30 కోట్ల బడ్జెట్​ రిలీజ్ అయిందని, ఔట్​సోర్సింగ్​ వర్కర్లకు బడ్జెట్​ ఆలస్యం అవుతున్నందున ఐటీడీఏ నుంచి రెండు నెలల జీతం ఇస్తామని తెలిపారు. ఇల్లందు, పాల్వంచ, బూర్గంపాడు హాస్టళ్లలోని వర్కర్లకు ఏజెన్సీ ప్రాంతంలో మిగిలిన వర్కర్ల మాదిరిగా నెలకు రూ.21,690 వేతనం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

భద్రాద్రి పరిరక్షణకు ఐక్యంగా ఉద్యమిద్దాం
భద్రాచలం,వెలుగు: గోదావరి ముంపు నుంచి భద్రాచలాన్ని కాపాడాలనే ప్రధాన డిమాండ్​తో సీపీఐ ఆధ్వర్యంలో భద్రాచలంలో రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. గోదావరి కరకట్ట పొడిగింపునకు చర్యలు తీసుకోవాలని, పోలవరం ముంపుపై నిపుణులతో కమిటీ వేయాలని, ఐదు పంచాయతీలను తెలంగాణలో కలుపుతూ కేంద్రం ఆర్డినెన్స్ తేవాలని చేపట్టిన దీక్షలను ఎమ్మెల్యే పొదెం వీరయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, సేవ్​ భద్రాద్రి నిర్వాహకులు పాకాల దుర్గాప్రసాద్​ ప్రారంభించారు. ఐఎంఏ అధ్యక్షుడు డా.సుదర్శన్​, కెమిస్ట్ అండ్​ డ్రగ్గిస్ట్​ అధ్యక్షుడు పరిమి సోమశేఖర్, ఆల్​ పెన్షనర్స్ అసోషియేషన్​ నాయకులు హరినాథ్​ మద్దతు పలికారు. ఇదిలాఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ సీపీఐ లీడర్లు కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపి అంబేద్కర్​ విగ్రహానికి వినతిపత్రం అందించారు.

పోటీతత్వం పెరగాలి

సత్తుపల్లి, వెలుగు:విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలని మదర్ థెరిసా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ చలసాని హరికృష్ణ అన్నారు. ఆజాదీకా అమృత్​ మహోత్సవంలో భాగంగా శనివారం కాలేజ్​ ఎన్ఎస్ఎస్  విభాగం ఆధ్వర్యంలో వ్యాసరచన, డిబేట్, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఇంజనీరింగ్ డీన్ జాకీర్ హుస్సేన్, ఎన్ఎస్ఎస్  ప్రోగ్రాం ఆఫీసర్​ రామకృష్ణారెడ్డి 
తదితరులు పాల్గొన్నారు.