పోటీచేసే అభ్యర్థులు క్రిమినల్ కేసులు బహిరంగంగా ప్రకటించాలి : రొనాల్డ్ రాస్

పోటీచేసే అభ్యర్థులు క్రిమినల్ కేసులు బహిరంగంగా ప్రకటించాలి  :  రొనాల్డ్ రాస్

హైదరాబాద్ లో  ఎన్నికల నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్. ఎల్లుండి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని తెలిపారు. నగరంలో 45 లక్షల 70 ఓట్లు ఉన్నాయని, 3986 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.గత ఎన్నికల్లో 45శాతం మాత్ర ఓటింగ్ జరిగిందని.. ఈ సారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. పోటీచేసే అభ్యర్థులు క్రిమినల్ కేసులు బహిరంగంగా ప్రకటించాలన్నారు. 

ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే సీ-విజిల్ యాప్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు రొనాల్డ్ రాస్.  మరోవైపు  ఎన్నికల విధులకు హాజరుకాని సిబ్బందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయనున్నట్టు రొనాల్డ్‌ రాస్‌ హెచ్చరించారు. ఎన్నికల్లో పాల్గొనేందుకు 23వేల మంది సిబ్బందిని శిక్షణకు ఎంపిక చేస్తే 1700 మంది గైర్హాజరయ్యారని మండిపడ్డారు. వారిలో అనారోగ్యంతో బాధపడేవారు, గర్భిణిలను మినహాయించి మిగిలిన వారిపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేస్తామని హెచ్చరించారు.