హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్‌ఎఫ్‌సీ) టీమ్‌కు మెడికల్ స్పాన్సర్ గా వ్యవహరించేందుకు కాంటినెంటల్ హాస్పిటల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు నగరంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో హెచ్‌ఎఫ్‌సీ జెర్సీ, లోగోను లాంచ్ కాంటినెంటల్ హాస్పిటల్స్ చైర్మన్, ఎండీ డాక్టర్ గురు ఎన్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మిగిలిన క్రీడలతో పోలిస్తే ఫుట్ బాల్ క్రీడాకారులకు గాయాల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కాంటినెంటల్ హాస్పిటల్స్ క్రీడాకారుల కోసం ప్రత్యేకంగా శిక్షణపొందిన డాక్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎఫ్‌సీ సీఈవో ధ్రువ్ సూడ్, ప్లేయర్లు, కోచ్ పాల్గొన్నారు.