తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి భక్తులు 30 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న 62వే 624 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 32వేల 638 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శుక్రవారం (మే 3) శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.96 కోట్లు.

  
తిరుమల శ్రీవారికి ఏప్రిల్ నెలలో కూడా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. పాత రికార్డును కొనసాగిస్తూ.. ఏప్రిల్ లో కూడా హుండీ ఆదాయం రూ. 100 కోట్ల మార్క్ ను అందుకుంది. అయితే మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో ఆదాయం తగ్గింది. ఎన్నికల ప్రభావంతో పాటుగా పరీక్షల కారణంగా ఆదాయం తగ్గిందని భావిస్తున్నారు.