August 2024 : పిల్లలూ పండగ చేసుకోండి.. స్కూళ్లకు భారీగా సెలవులు.... హాలిడేస్ లిస్ట్ ఇదే..

August 2024 :  పిల్లలూ పండగ చేసుకోండి..  స్కూళ్లకు భారీగా సెలవులు.... హాలిడేస్ లిస్ట్ ఇదే..

కొత్త అకడమిక్ ఇయర్‌(2024‌‌–25)లో విద్యార్థులు పూర్తి స్థాయిలో చదువుల్లో నిమగ్నమవ్వడానికి ముందు, కావాల్సినంత విశ్రాంతి ఈ హాలిడేస్‌లో దొరుకుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో పాఠశాలలకు ఎప్పుడెప్పుడు సెలవులు రానున్నాయో తెలుసుకుందాం.

సెలవులంటే ఇష్టం లేనివాళ్లు ఉండరు. హాస్టల్స్ లో చదువుకునే విద్యార్థులు, రోజూ అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు ఇలా వీరంతా సెలవుల కోసం  ఎదురుచూస్తుంటారు. సెలవు వస్తే ఇంటికెళ్ళిపోయి అమ్మ చేతి వంట తినాలని.. బయట ఫ్రెండ్స్ తో ఆడుకోవాలని.. సరదాగా గడపాలని అనుకుంటారు. అయితే సెలవుల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఆగస్టు నెల ఎక్కువగానే సెలవులను పట్టుకొచ్చేసింది. రెండవ శనివారం, స్వాతంత్య్ర దినోత్సవం ఇలా పలు పండగలు, ఆదివారాలు అన్నీ కలిపి మొత్తం 9 రోజులు సెలవులు ఉన్నాయి. 

పాఠశాలలకు సంబంధించి సెలవుల విషయానికొస్తే..  ఆగస్టు నెలలో 31 రోజులకు గాను 22 పని దినాలు ఉన్నాయి. అంటే 9 రోజులు సెలవులు. అయితే వరలక్ష్మి వ్రతం, రాఖీ పూర్ణిమ కారణంగా సెలవులు ఉండనున్నాయి.

  •  ఆగస్టు 4న ఆదివారం
  •  ఆగస్టు 10న రెండవ శనివారం 
  • ఆగస్టు 11న ఆదివారం
  • ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం
  • ఆగస్టు 16న శుక్రవారం  వరలక్ష్మి వ్రతం
  • ఆగస్టు 18న ఆదివారం
  • ఆగస్టు 19న రాఖీ పూర్ణిమ/శ్రావణ పూర్ణిమ
  • ఆగస్టు 25న ఆదివారం
  • ఆగస్టు 26 సోమవారం నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి

ఆగస్టు 9 వతేది సెలవు  పరిశీలన

ఆగస్టు 9వ తేదీన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆ రోజున సెలవు ప్రకటించాలని ఆదివాసీ నేతలు ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు.  ఇప్పుటికే  కొన్ని ఆదివాసీ రాష్ట్రాలు ఇప్పటికే ఆగస్టు 9వ తేదీన సెలవు ప్రకటించాయి. ఆ రోజున ఆదివాసీలకు సంబంధించిన సాంస్కృతిక, సంప్రదాయ కార్యక్రమాలు చర్చించుకోవడానికి వారు అవకాశం కల్పిస్తున్నారు. తెలంగాణలోనూ సెలవు ఇవ్వండి అని సీఎంకు విజ్ఞప్తి చేశారు.ఆదివాసీ దినోత్సవం రోజు సెలవు ప్రకటిస్తే ఆగస్టు నెలలో స్కూళ్లకు 10 రోజులు హాలిడేస్​ రానున్నాయి.  

వరుసగా ఐదు రోజులు హాలిడే..

ఆగస్టు 15, 16, 18, 19న 4 రోజులు సెలవులు ఉన్నాయి. మధ్యలో ఒకే ఒక్క రోజు వర్కింగ్ డేగా ఉన్న శనివారం సెలవు ఇస్తే కనుక వరుసగా 5 రోజులు సెలవులు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకొక రోజు సెలవు ఉండే అవకాశం ఉంది.