జ్వరాలు తగ్గే వరకు హెల్త్​క్యాంప్​ కొనసాగించాలె..ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జ్వరాలు తగ్గేంత వరకు చింతవర్రె గ్రామంలో హెల్త్​ క్యాంప్​ కొనసాగించాలని వైద్యశాఖాధికారులకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు  సూచించారు. లక్ష్మీదేవిపల్లి మండలంలోని చింతవర్రె గ్రామంలో జ్వరాలతో బాధపడుతున్న వారిని ఎమ్మెల్యే శుక్రవారం పరామర్శించారు. జ్వర బాధితులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ లక్షణాలున్న వారికి ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలన్నారు.  

వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన ట్రీట్ మెంట్​ అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఆయన వెంట కోరం కనకయ్య, ఎంపీపీ భూక్యా సోనా, ఏఎంసీ చైర్మన్​ భూక్యా రాంబాబు, డిప్యూటీ డీఎంహెచ్​ఓ డాక్టర్​ సుకృత, ఎండీఓ రమేష్​,ఎంపీఓ శ్రీనివాసరావు, సీడీపీఓ కనకదుర్గ, మెడికల్​ ఆఫీసర్​ స్వప్న పాల్గొన్నారు