చిలుకూరులో కొనసాగిన హై టెన్షన్

చిలుకూరులో  కొనసాగిన  హై టెన్షన్

చేవెళ్ల, వెలుగు: ఒక మతానికి చెందిన పురాతన నిర్మాణం కూల్చివేతపై ఇరువర్గాల మధ్య మూడు రోజులుగా వివాదం కొనసాగుతోంది. దీంతో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పీఎస్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. చిలుకూరు రెవెన్యూలో సర్వే నంబర్ 199లో వక్ఫ్​బోర్డు భూమిలో అతి పురాతన నిర్మాణం కూల్చివేతపై కుతుబ్ షాహీ మజీద్ పేరుతో కొందరు ఫ్లెక్సీలను కట్టారు. 

దీన్ని నిరసిస్తూ చిలుకూరు గ్రామస్తులు, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మైనార్టీ వర్గానికి చెందిన ఓ ఎమ్మెల్సీ , ఓ పోలీసు ఉన్నతాధికారి కూల్చివేత ఘటన స్థలానికి ఎలా వస్తారని బజరంగ్ దళ్ నేతలు ఆరోపించారు. రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని  శ్రీనివాస్ ఇరువర్గాలకు నచ్చజెపుతూ శాంతింపచేశారు. చలో చిలుకూరు బాలాజీ ఆలయం అంటూ బజరంగ్ దళ్ బుధవారం పిలుపునివ్వగా సైబరాబాద్ కమిషనర్ అవినాష్​ మహంతి ఐపీసీ సెక్షన్ 163 విధించారు. మతపరమైన ఘర్షణలు చోటు చేసుకుంటాయనే సమాచారం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.  ఎస్ఐబీ, పోలీసులు, ఇంటెలిజెన్స్ పోలీసులు సైతం ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.