తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి ఎదురు చూస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. టైం స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.
నిన్న తిరుమల శ్రీవారిని 80 వేల మంది దర్శించుకున్నారు. స్వామివారిని 32,967 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి హుండీ ఆదాయం 4 కోట్ల 7లక్షలు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. నేడు శ్రీవారిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దర్శించుకోనున్నారు.