పండగ పూట పస్తులుంటున్నం...చెట్ల ఆకులు తింటూ వినూత్న నిరసన 

బెల్లంపల్లి, వెలుగు: తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పనిచేసే కాంట్రాక్ట్, ఔట్​ సోర్సింగ్​ కార్మికులు, వైద్య సిబ్బంది చెట్ల ఆకులు తింటూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. తమ సమస్యలను సంబంధిత అధికారులు, జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌కు తెలియజేసినా పట్టించుకోకపోవడంతో ఈ నిరసన చేపట్టినట్లు చెప్పారు.

తమకు గత ఐదు నెలలుగా ఔట్​సోర్సింగ్ ఏజెన్సీ కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ పూట కూడా పస్తులుండాల్సి వస్తోందని వాపోయారు. వేతనాలు చెల్లించకపోవడంతో పాటు కార్మిక చట్టం నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఔట్​సోర్సింగ్ ఏజెన్సీపై మండిపడ్డారు. ప్రభుత్వం జీవో నంబర్ 60ని అమలు చేయాలన్నారు. ఈ సమ్మెకు సీఐటీయు లీడర్లు సంకె రవి, అబ్బోజు రమణ తదితరులు మద్దతు తెలిపారు.