
- ఓయూ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వద్ద నిరవధిక సమ్మె
ఓయూ, వెలుగు: రాష్ట్రంలోని 12 యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ శనివారం ఓయూ అడ్మినిస్ట్రేటివ్ఆఫీస్వద్ద కాంట్రాక్ట్ అసిస్టెంట్ప్రొఫెసర్లు నిరవధిక సమ్మెకు దిగారు. ర్యాలీలు, సమావేశాల ద్వారా తమ నిరసన తెలియజేసినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని వాపోయారు. దీంతోనే స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు దిగామన్నారు. క్లాసును బహిష్కరించామని తెలిపారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కాంట్రాక్ట్ అసిస్టెంట్ప్రొఫెసర్ల న్యాయమైన డిమాండ్ ని పరిష్కరించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సమ్మెలో ఉపేందర్, సీమర్ల విజేందర్ రెడ్డి, పరుశురామ్, వేల్పుల కుమార్, తాళ్లపల్లి వెంకటేశ్, పాండేయ్య, రేష్మా రెడ్డి, వినీత పాండే, కృష్ణయ్య, సీహెచ్ వెంకటేశ్, రాజు, సత్యం, నీరజ తదితరులు పాల్గొన్నారు.