కాంట్రాక్ట్​ ఉద్యోగులను రెగ్యులర్​ చేయాలి

కాంట్రాక్ట్​ ఉద్యోగులను రెగ్యులర్​ చేయాలి
  • 29న చలో హైదరాబాద్ సక్సెస్ చేయాలని పిలుపు

ఆసిఫాబాద్, వెలుగు: గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న 2685 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అజ్మీరా పూల్ సింగ్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఆదివాసీ భవన్​లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై మాట్లాడారు. గత 24 సంవత్సరాలుగా గిరిజన ఆశ్రమ స్కూళ్లలో 2100 కాంట్రాక్ట్​ టీచర్లు, గిరిజన సంక్షేమ గురుకులాల్లో 491 మంది కాంట్రాక్టు, బోధినేతర ఉద్యోగులు, 94 మంది గిరిజన సహకార సంస్థలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా సేవలందిస్తున్నారని, వారిని రెగ్యులర్ చేయాలని ఈనెల 29న హైదరాబాద్​లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సదస్సును సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. 

కాంట్రాక్ట్​ ఉద్యోగులను రెగ్యులర్ చేసిన తర్వాతే గిరిజన శాఖలో నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బత్తుల ఎర్రయ్య , కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు సంఘం జిల్లా అధ్యక్షుడు కొమురెల్లి శంకర్, ప్రధాన కార్యదర్శి జర్పుల విజేశ్, అత్రం పెంటయ్య, శంకర్ దేవ్ తదితరులు 
పాల్గొన్నారు.