బాడీ పార్ట్స్‌‌‌‌ తాకనిస్తేనే ఇంటర్నల్‌‌‌‌ మార్కులు

బాడీ పార్ట్స్‌‌‌‌ తాకనిస్తేనే ఇంటర్నల్‌‌‌‌ మార్కులు
  • ఇంటర్‌‌‌‌ స్టూడెంట్లను వేధిస్తున్న కాంట్రాక్ట్‌‌‌‌ లెక్చరర్‌‌‌‌
  • ఖమ్మం గర్ల్స్​ జూనియర్‌‌‌‌ కాలేజీలో వెలుగుచూసిన ఘటన

ఖమ్మం, వెలుగు : బాడీ పార్ట్స్‌‌‌‌ తనకు తాకేలా నిలబడితేనే ఇంటర్నల్‌‌‌‌, ప్రాక్టికల్‌‌‌‌ ఎగ్జామ్‌‌‌‌లో మార్కులు వేస్తానంటూ ఓ లెక్చరర్‌‌‌‌ స్టూడెంట్లను వేధించిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే... ఖమ్మం నగరానికి చెందిన కొండా హరిశంకర్‌‌‌‌ స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్‌‌‌‌ కాలేజీలో కాంట్రాక్ట్‌‌‌‌ లెక్చరర్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. 

కాలేజీలో ఇంటర్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ ఇయర్‌‌‌‌ చదువుతూ, కాల్వొడ్డు సమీపంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌‌‌‌లో ఉంటున్న ఓ స్టూడెంట్‌‌‌‌కు ఇటీవల ఖరీదైన సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ కొనిచ్చాడు. బాలిక వద్ద సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ను గమనించిన హాస్టల్‌‌‌‌ సిబ్బంది వార్డెన్‌‌‌‌కు సమాచారం ఇచ్చారు. వార్డెన్‌‌‌‌ సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ను తీసుకొని పరిశీలించగా అసభ్యకరమైన మెసేజ్‌‌‌‌లు కనిపించాయి. 

సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ ఎక్కడిదని ప్రశ్నించగా.. లెక్చరర్‌‌‌‌ కొనిచ్చాడని చెప్పడంతో  వెంటనే ఆ బాలిక పేరెంట్స్‌‌‌‌ను పిలిపించడంతో పాటు కాలేజీ ప్రిన్సిపాల్‌‌‌‌కు ఫిర్యాదు చేశారు. లెక్చరర్‌‌‌‌ను మందలించాల్సిన ప్రిన్సిపాల్‌‌‌‌ పేరెంట్స్‌‌‌‌కు, వార్డెన్‌‌‌‌కు నచ్చ జెప్పి పంపడంతో వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఇంటర్మీడియట్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ రవిబాబు శుక్రవారం కాలేజీకి వచ్చి విచారణ చేపట్టారు. స్టూడెంట్లు, కాలేజీ సిబ్బందితో మాట్లాడారు. 

ఈ క్రమంలో లెక్చరర్‌‌‌‌ వేధింపుల గురించి స్టూడెంట్లు ఆఫీసర్‌‌‌‌కు వివరించారు. కాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంట్రాక్ట్‌‌‌‌ లెక్చరర్‌‌‌‌ హరిశంకర్‌‌‌‌ పరారీలో ఉన్నాడు. లెక్చరర్‌‌‌‌పై గతంలోనూ ఫిర్యాదులు అందినా యూనియన్ల జోక్యంతో సెటిల్‌‌‌‌మెంట్లు జరిగాయని పలువురు ఆరోపిస్తున్నారు. 

కలెక్టర్, అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌కు వినతి

స్టూడెంట్లను లైంగికంగా వేధిస్తున్న కాంట్రాక్ట్‌‌‌‌ లెక్చరర్‌‌‌‌ హరిశంకర్‌‌‌‌పై పోక్సో కేసు నమోదు చేయాలని ఏఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌, ఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌, పీడీఎస్‌‌‌‌యూ, డీవైఎఫ్ఐ, ఐద్వా, ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో కాలేజీ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌‌‌‌కు వెళ్లి కలెక్టర్‌‌‌‌ ముజమ్మీల్‌‌‌‌ఖాన్‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు. పీడీఎస్‌‌‌‌యూ ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్‌‌‌‌ శ్రీజను కలిసి.. లెక్చరర్‌‌‌‌పై క్రిమినల్‌‌‌‌ కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు.