19 నుంచి కాంట్రాక్టు ప్రొఫెసర్ల సమ్మె

19 నుంచి కాంట్రాక్టు ప్రొఫెసర్ల సమ్మె

ఓయూ, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని ఏప్రిల్ 19 నుంచి నిరధిక సమ్మెను నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొ. ధర్మతేజ తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓయూలోని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంట ర్​లో ఆదివారం సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ధర్మతేజ మాట్లాడారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు బేసిక్, డీఏ, హెచ్ఆర్ఏ, 3% ఇంక్రిమెంట్స్​తో కూడిన వేతన స్కేలును అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ప్రభుత్వంలోని మంత్రులు, ఉన్నతాధికారులను కలిసిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని చెప్పారు. గత నాలుగు రోజుల నుంచి ఎన్నో రకాలుగా నిరసనలు తెలిపినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 

ఈ నెల 15న అన్ని వర్సిటీల్లోని వీసీలకు నిరువధిక సమ్మెకు సంబంధించిన నోటీసులు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అదే రోజు ఓయూలో మహాధర్నా నిర్వహిస్తామని వివరించారు. 16,17 తేదీల్లో ఇందిరా పార్క్​ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్టు వెల్లడించారు.