మా ఉద్యోగాలను పర్మినెంట్ చేయండి

మా ఉద్యోగాలను పర్మినెంట్ చేయండి
  • తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్​విద్యాసంస్థల కాంట్రాక్ట్​ టీచర్లు

పంజాగుట్ట,వెలుగు: తెలంగాణ మైనారిటీ​రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లోని కాంట్రాక్ట్​ టీచింగ్,నాన్​టీచింగ్​ఉద్యోగులను పర్మినెంట్​చేయాలని ఉద్యోగుల సంఘం​ప్రభుత్వాన్ని డిమాండ్​చేసింది. ఆదివారం ప్రెస్​క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం  మహిళా నేతలు షమీమ్, అరుణ,షల్మన్​ఖాదం, తన్వీర్​మాట్లాడుతూ..  మొత్తం 31 మంది టీచర్లు కాంట్రాక్ట్​ పద్ధతిన పని చేస్తున్నామన్నారు. 

2014లో  రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏపీ రెసిడెన్షియల్​స్కూల్​ సొసైటీని తెలంగాణ మైనారిటీ విద్యాసంస్థలో విలీనం చేశారని పేర్కన్నారు.  అయితే వారికి ప్రభుత్వ టీచర్లకు లభించే సౌకర్యాలు, హక్కులు లేవన్నారు. తమ సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి స్పందించి న్యాయం చేయాలని కోరారు . తమలో  కొందరు ఇప్పటికే రిటైర్ మెంట్ కు దగ్గరలో ఉన్నామన్నారు.