కాంట్రాక్ట్​ కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించాలె

కాంట్రాక్ట్​ కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించాలె

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి సంస్థ లాభాల్లో వాటాను కేటాయించాలని డిమాండ్​ చేస్తూ ఐఎఫ్​టీయూ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్​ కార్మికులు ధర్నాకు దిగారు. శుక్రవారం సాయంత్రం మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్ సింగరేణి సివిల్​ఆఫీస్​ముందు సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్​వర్కర్స్ యూనియన్​(ఇఫ్టూ) లీడర్లు, కార్మికులు ఆందోళన చేపట్టారు. యూనియన్​ స్టేట్​ ప్రెసిడెంట్​డి.బ్రహ్మనందం మాట్లాడుతూ.. సింగరేణి కాంట్రాక్ట్​ కార్మికులకు కోలిండియా వేతనాలు అమలు చేయాలని డిమాండ్​ చేశారు. 

కాంగ్రెస్​ సర్కార్​ ఏర్పడితే కాంట్రాక్ట్​ కార్మికులకు కోలిండియా వేతనాలు ఇప్పిస్తామని ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు, మంత్రులు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. గత బీఆర్​ఎస్​ సర్కార్ కార్మికులను మోసం చేసిందని, కాంగ్రెస్ ​ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. పర్మినెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్​ కార్మికులకు లాభాల్లో 10శాతం వాటా ఇవ్వాలని డిమాండ్​చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సింగరేణి సివిల్​ సూపర్​వైజర్ సమ్రాన్​కు అందజేశారు. లీడర్లు శంకర్, ముత్యాల వెంకటేశ్, మల్లేశ్, రాజన్న, రంజిత్, సంతోశ్ పాల్గొన్నారు.