కాగజ్నగర్: చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదని స్కూల్ గేట్కు ఓ కాంట్రాక్టర్ తాళం వేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణం పెట్రోల్ పంపు ఏరియాలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్లో మన ఊరు మన బడి కింద స్కూల్ బిల్డింగ్ను రూ. 97లక్షలతో కాంట్రాక్టర్ అబీబ్ నిర్మించాడు.
అయితే ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు తనకు రావాల్సిన బిల్లులను అధికారులు నిధులు విడుదల చేయలేదు. దీంతో ఇవాళ ఉదయం స్కూల్కు వచ్చిన కాంట్రాక్టర్ అబీబ్ గేట్కు తాళం వేశాడు. స్కూల్లో 292 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇవాళ్టి నుంచి ఫైనల్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులు స్కూల్ ముందు పడిగాపులు కాశారు. చివరకు గంట పాటు వేచి చూశారు.
విషయం తెలుసుకున్నా మన ఊరు మన బడి ప్రత్యేకాధికారి స్పందించి ఇప్పటికే బిల్లులు రాష్ట్ర ఆఫీస్కు పంపామని, మూడు రోజుల్లో బిల్లు వచ్చేలా చూస్తామని చెప్పడంతో కాంట్రాక్టర్ తాళం తీశాడు.