బిల్లులు రావడంలేదని క్లాస్​​రూమ్​కు తాళం

బిల్లులు రావడంలేదని  క్లాస్​​రూమ్​కు తాళం
  • బిల్లులు రావడంలేదన్న కాంట్రాక్టర్​​ 
  • తాళం వేయడంపై కలెక్టర్​ సీరియస్​
  • కాంట్రాక్టర్​పై చర్యలు తీసుకోవాలని ఆదేశం 

కామారెడ్డి, వెలుగు:  ‘మన ఊరు.. మన బడి’  పోగ్రాంలో నిర్మించిన  క్లాస్​ రూమ్స్​బిల్లులు మంజూరుకాకపోవడంతో ఓ  క్లాస్ రూమ్​కు  కాంట్రాక్టర్​ తాళం వేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డిలో జరిగింది.  స్థానికుల సమాచారం ప్రకారం..  కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి ప్రైమరీ స్కూల్​లో  ‘మన ఊరు..మన బడి’ పోగ్రాంలో  నాలుగు క్లాస్​ రూమ్స్​ నిర్మాణం చేపట్టారు.  ఇంకా ఫ్లోరింగ్, రంగులు​వేయాల్సి ఉంది.  

క్లాస్​ రూమ్స్​ తక్కువగా ఉండటంతో కొత్తగానిర్మించిన ఒక రూమ్​ వినియోగిస్తున్నారు.   పనులు చేపట్టి నెలలు గడుస్తున్నా తనకు బిల్స్ ​మంజూరు కావడం లేదని  కాంట్రాక్టర్​ నిఖిల్ రావు   బుధవారం సాయంత్రం ఆ రూమ్​కు తాళం వేశాడు. గురువారం ఉదయం స్కూల్​ వచ్చిన  స్టూడెంట్స్​క్లాస్​ రూమ్​కు తాళం వేసి ఉందని తల్లిదండ్రులకు చెప్పారు.  కాంట్రాక్టర్​తో మాట్లాడిన గ్రామస్తులు తనకు బిల్స్​​ రానందున తాళం వేసినట్లు చెప్పాడు.  గ్రామస్తులు  నచ్చజెప్పడంతో అతడు​ తాళం చెవిని తిరిగి టీచర్లకు అప్పగించాడు.  

 క్లాస్​ రూమ్​కు తాళం వేసిన విషయాన్ని కలెక్టర్​ ఆశిశ్​​ సంగ్వాన్​ సీరియస్​గా తీసుకున్నారు.   కాంట్రాక్టర్​పై పోలీస్​ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని డీఈవో రాజును ఆదేశించారు.   హెచ్​ఎం హన్మండ్లు దేవునిపల్లి  ఫిర్యాదు మేరకు  కాంట్రాక్టర్​ నిఖిల్​రావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్​ఐ రాజు  తెలిపారు.