భద్రాద్రిలో జేసీబీల టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోల్‌‌‌‌‌‌‌‌మాల్!

భద్రాద్రిలో జేసీబీల టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గోల్‌‌‌‌‌‌‌‌మాల్!
  • కొన్నేండ్లుగా ఒకే సంస్థకు దక్కుతున్న కాంట్రాక్ట్​
  • జెన్‌‌‌‌‌‌‌‌కో లోతుగా దర్యాప్తు చేయాలని కాంట్రాక్టర్ల డిమాండ్

హైదరాబాద్, వెలుగు: జెన్‌‌‌‌‌‌‌‌కో ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నడుస్తున్న భద్రాద్రి థర్మల్​పవర్​ప్లాంట్​ (బీటీపీఎస్)లో కోల్ ఫిల్ చేసే జేసీబీల కాంట్రాక్ట్ గత కొన్నేండ్లుగా ఒకే సంస్థ దక్కించుకుంటున్నది. బీటీపీఎస్‌‌‌‌‌‌‌‌లోని కొందరు అధికారులు ఆ సంస్థకు అనుకూలంగా నిబంధనలను రూపొందిస్తుండడం వల్లే ఒకే సంస్థ కాంట్రాక్ట్​ దక్కించుకుంటోందనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా మళ్లీ అదే సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు కొందరు పావులు కలుదుతున్నట్లు తెలుస్తున్నది. 

మణుగూరు ప్లాంట్​కు అవసరమైన బొగ్గును సింగరేణి సరఫరా చేస్తుంది. బొగ్గు లారీల ద్వారా బీటీపీఎస్​కు వచ్చి కన్వేయర్​ బెల్ట్​వద్ద డంపింగ్​జరుగుతుంది. కిందున్న బొగ్గును కన్వేయర్​బెల్ట్​పైకి వేసేందుకు జేసీబీలను వినియోగిస్తారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఈ జేసీబీల టెండర్లను ఏండ్ల తరబడి ఒకే కాంట్రాక్టర్ కి కట్టబెడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. గతంలో అదే కాంట్రాక్టర్ కు మొదట టెండర్ దక్కినప్పుడు లేని నిబంధనలు తాజాగా చేర్చి సదరు సంస్థకే టెండర్​ దక్కేలా కొందరు అధికారులు పావులు కదుపుతున్నట్లు ఇతర కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

గతంలో సదరు కాంట్రాక్టర్ కి సంబంధించిన పనుల్లో వేరే కాంట్రాక్టర్​ టెండర్ వేసినందుకు ..సదరు వ్యక్తిపై దాడి చేసి టెండర్లలో పాల్గొనకుండా చేశారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అధికారుల అండదండలు ఉండడంతో జేసీబీలు పని చేసినా, చేయక పోయినా బిల్స్​ క్లెయిమ్​ చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ జేసీబీల వ్యవహారంపై జెన్​కో అధికార యంత్రాంగం లోతుగా దర్యాప్తు చేయాలని బీటీపీఎస్​ వర్గాల్లో చర్చ జరుగుతోంది.