మన ఊరు మన బడి బిల్లులు రాలేవని కాంట్రాక్టర్ ఆత్మహత్య

నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం కల్లడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మన ఊరు మన బడి పనుల బిల్లులు రాలేవని కాంట్రాక్టర్ విజయ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు  కారకులైన  అధికారులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేసిన పనుల బిల్లులు మంజూరు చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కు కాంట్రాక్టర్ విజయ్ లేఖ రాశారు. కల్లడి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో మేజర్, మైనర్ పనులు చేశానని..ఇంకా కొంత పని మిగిలిఉందని కాంట్రాక్టర్ విజయ్ లేఖలో పేర్కొన్నారు. అయితే చేసిన పనులకు బిల్లులు మంజూరు కాలేదన్నారు. మక్లూర్ మండల AE కు ఎన్నిసార్లు విన్నవించినా..బిల్లులు ఆన్ లైన్ చేయడం లేదని లేఖలో తెలిపారు. అయితే లేఖ రాసినా కూడా...బిల్లులు మంజూరు కాకపోవడంతో అప్పుల బాధకు కాంట్రాక్టర్ విజయ్ సూసైడ్ చేసుకున్నారు.