
పంజాగుట్ట, వెలుగు: కాంట్రాక్టర్లు చేసిన పనులకు రెండేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లించట్లేదని నేషనల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆరోపించింది. ఇప్పటివరకు అన్ని విభాగాల కాంట్రాక్టు పనులకు సంబంధించి ప్రభుత్వం రూ.14 వేల కోట్లు బకాయి ఉందన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో నేషనల్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు అధ్యక్షుడు వి.శ్రీనివాస గౌడ్, కార్యదర్శి కె. వెంకటేశ్వరరావు ప్రకటించారు.